telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ : ఆస్తిపన్ను 96.5 శాతం వసూలు .. రికార్డు స్థాయి..

IT officials raid houses of Sandalwood actors

స్థానిక జీహెచ్‌ఎంసీ లో ఆస్తి పన్నుల వసూళ్ల ప్రక్రియ ఆదివారం రాత్రితో ముగిసింది. ఈ సారి రికార్డు స్థాయిలో ఆస్తి పన్నులు చెల్లింపులు జరిగాయి. సెంట్రల్ జోన్ పరిథిలోని 17, 18 సర్కిళ్లలో గత ఏడాది కంటే అధికంగా పన్నుల రూపంలో ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ సర్కిల్ 17లో 2017-18లో రూ.110.93 కోట్లు, జూబ్లీహిల్స్ సర్కిల్-18 పరిథిలో 2017-18లో రూ.125 కోట్లు వసూలు కాగా, ఈ సారి సర్కిల్-17లో 2018-19 సంవత్సరానికి రూ.121.5కోట్లు, సర్కిల్-18లో రూ.138.5 కోట్లు వసూలయ్యాయి.

ఆదివారం చివరి రోజు కావటంతో అధికారులు రాత్రి వరకు పన్నులు చెల్లించే అవకాశం కల్పించారు. దీనితో సర్కిల్ 17 పరిథిలో ఒక్కరోజే రాత్రి తొమ్మిది గంటల వరకు జంట సర్కిళ్లలో రూ.6.5 కో ట్లు వసూలు కావటం విశేషం. మొత్తం నిర్ణీత గడువులో 96.5 శాతం పన్ను లు వసూలు చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు.

Related posts