• Home
  • Trending Today
  • మీ ఇంట్లో అగరుబత్తీలు వాడుతున్నారా..? అయితే భారీ మూల్యం చెల్లించాల్సిందే
Trending Today ఆరోగ్య వార్తలు భక్తి వార్తలు సామాజిక

మీ ఇంట్లో అగరుబత్తీలు వాడుతున్నారా..? అయితే భారీ మూల్యం చెల్లించాల్సిందే

Incense are Unhealthy to all effects on DNA

దేవుడు కరుణించాలంటే దీప, దూప నైవేద్యాలతో ఆరాధించాలని చెబుతారు.. అందుకోసమే పూజా సమయాల్లో తప్పనిసరిగా ‘అగరు బత్తి’ని వెలిగిస్తారు… అయితే అగరు బత్తిలు వెలిగిస్తే ఇల్లంతా సువాసనలు అలుముకుని మనసులో ఒక పవిత్రమైన ఆధ్మాత్మిక భావం నెలకొంటుంది.. దీనితో పూజలకోసమే కాకుండా ఇంట్లో సువాసనల కోసం కూడా అగరు బత్తిలను వినియోగిస్తున్నారు.. దీనితో మార్కెట్లో వివిధ రకాలకు సంబందించిన అగరుబత్తులు పుట్టుకొచ్చాయి…. ఇటీవల కాలంలో జరిపిన పరిశోధనల్లో అగరుబత్తీల పొగ చాలా ప్రమాదకరమని వీటి తయారీలో సుమారు 90 శాతం హాని కారక బొగ్గుపొడిని ఉపయోగిస్తున్నారని వీటిని వెలిగిస్తే కార్బన్ మొనాక్సైడ్(CO), నైట్రోజెన్ డయాక్సైడ్(NO2) లాంటి విషపూరితమైన వాయువులు వెలువడుతున్నాయని వీటి వాడకాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు..

లేదంటే అగరుబత్తులనుంచి వెలువడే పొగ ప్రభావం మనిషి డీఎన్ఏ (డియోక్సిబ్రోన్యుక్లియిక్ ఆమ్లం) పై పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు… దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు, ఇంట్లో అగరుబత్తులు నిత్యం వెలిగించేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని ఇంట్లో చిన్న పిల్లలు ఉంటె మరింత అప్రమత్తతతో ఉండాలని హెచ్చరిస్తున్నారు… లేదంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వారవుతారని తెలిపారు…

Related posts

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు: గల్లా జయదేవ్

madhu

ఇకపై గ్రాఫిక్స్ కి దూరమంటున్న శంకర్… రోబో 2 సినిమా విడుదల ఆలస్యం.. క్లారిటీ

nagaraj chanti

అవినీతి తిమింగలాల పై..కేంద్రం కేసు నమోదు చేయలేదు: ఆర్బీఐ మాజీ గవర్నర్

madhu

Leave a Comment