telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికల అప్పుడే ఎందుకు ఇన్ని ప్రారంబోత్సవాలు.. !!

pm modi fire pulvama terror attacks

ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పర్యటనలు ముగిసే వరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయకుండా సీఈసీ ఆలస్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమలు వస్తుంది. ఎన్నికల వ్యూహాంలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9 మధ్య ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, గ్యాస్ పైపులైన్లు, విమానాశ్రయాలు, నీళ్ల కనెక్షన్లు, పవర్ ప్లాంట్లు తదితర ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 7 మధ్య సుమారు 57 ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాతి నాలుగు వారాల్లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల సంఖ్య మూడింతలు పెరగడం గమనార్హం.

గతంలో వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్ తన కాలపరిమితి ముగింపునకు ముందు ఎలాంటి ఎన్నికల స్టంట్ కార్యక్రమాలు చేయకపోవడం విశేషం. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నెలరోజుల ముందు వరకు ప్రధాని హోదాలో మన్మోహన్ ఎలాంటి పర్యటనలు చేయకపోవడం విశేషం.

Related posts