telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ విజయం…

Imran

నేడు జరిగిన విశ్వాస పరీక్షలో 178 ఓట్ల మద్దతో విజయం సాధించారు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ విశ్వాస పరీక్ష నెగ్గడానికి ఇమ్రాన్‌ ఖాన్‌కు 172 మంది మద్దతు అవసరం ఉండగా.. ఆయనకు 178 మంది మద్దతు తెలిపారు.. దీంతో.. ఆయన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. కాగా, సెనెట్‌కు జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌ కేబినెట్‌లోని ఆర్థిక మంత్రి.. ఓడిపోయారు.. 7 ఓట్లతో తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే.. అప్పటి నుంచి ప్రధాని పదవికి ఇమ్రాన్ రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.. దీనికి చెక్ పెట్టాలనుకున్న ఇమ్రాన్.. పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షకు వెళ్లి విజయం సాధించారు.. దీంతో ప్రతిపక్షాల నోళ్లు మూయించినట్టు అయ్యింది. పాకిస్థాన్ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా సమావేశమైంది పార్లమెంట్‌.. దిగువ సభలో 342 మంది సభ్యులుండగా.. ఇమ్రాన్ విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 172 మంది మద్దతు కావాలి.. కానీ, ఆయన 178 ఓట్లు సాధించారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది.

Related posts