• Home
  • వార్తలు
  • పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం.. హాజరైన క్రికెటర్ సిద్ధూ
రాజకీయ వార్తలు వార్తలు

పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం.. హాజరైన క్రికెటర్ సిద్ధూ

Imran khan oath, Pakistan Priminster

తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ)అధినేత, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌ దిగువ సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ భారీ ఆధిక్యంతో నెగ్గారు. శనివారం ఉదయం ఇమ్రాన్ ఖాన్ చేత పాక్ అధ్యక్షుడు మామ్మూస్ హుస్సేన్ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో పాకిస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వంశపాలన ముగిసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ కార్యక్రమానికి దిగ్గజ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. తన స్నేహితుడైన సిద్ధూను తొలి వరుసలోనే కూర్చోబెట్టి ఇమ్రాన్ గౌరవించారు. ప్రమాణస్వీకారం సమయంలో సిద్ధూ ఎంతో ఆనందంగా గడిపారు. అనంతరం ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని చాలా దోచుకున్నారు. వారందరినీ తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా అని అన్నారు. కాగా దేశంలో అవినీతిని తగ్గించి అధునాతన పాకిస్తాన్‌ను ఆవిష్కరిస్తానని ఇమ్రాన్ చెప్పారు.

Related posts

కేసీఆర్ నాలుగేళ్లలో సాధించిన ప్రగతి.. ప్రగతి భవన్ మాత్రమే: జీవన్‌ రెడ్డి

madhu

కుటుంబీకుల సమక్షంలో ప్రియుడితో పడక సుఖం.. భర్తను కాటికి పంపిన వైనం

nagaraj chanti

జ్వరం అని వెళ్తే… లక్షలకు లక్షలు గుంజిన వైనం…

jithu j

Leave a Comment