telugu navyamedia
రాజకీయ

ఇమ్రాన్ ఖాన్ చర్చలకు సిద్దమన్నాడు … ఎందుకో తెలుసా ?

Pak people attack pak poilet
భారత్ తో చర్చలకు  సిద్ధమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్   ఆ దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు . ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి . మంగళవారం నాడు బాలాకోట్ పై జరిగిన దాడికి ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ కొన్ని గంటల్లోనే మాట మార్చేశాడు  అతని స్వరంలో తీరు కూడా మారిపోయింది . 
“మీ భూభాగంలోకి మేము వచ్చాము , మా భూభాగంలోకి మీరు వచ్చారు … ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త  పరిస్థితులు నెలకొని వున్నాయి ,యుద్ధం మొదలు పెట్టడం సులువే… కానీ ఆ తరువాత నా చేతుల్లో కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లో కానీ ఉండదు … మొదటి ప్రపంచ యుద్ధం , రెండవ ప్రపంచ  యుద్ధం ఫలితాలు అందరికీ తెలుసు… అందుకే సమస్యను సామరస్యంగా  చర్చల ద్వారా  పరిష్కరించుకుందాం ” అని సందేశం ఇచ్చాడు. 
Modi Imran Khan
పాకిస్తాన్ ప్రజలకు యుద్ధం వాళ్ళ జరిగే నష్టాలను పరోక్షంగా చెప్పాడు .  భారత్ తో యుద్ధం చేయలేమని చేతులెత్తేశాడు . పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంతలోనే ప్లేట్ మార్చేయడంలో ఆంతర్యమేమిటో తెలుసా ? భయం … అంతులేని భయం … పాకిస్తాన్  సర్వ నాశనం అయిపోతుందనే ఆందోళన . అమెరికా ఆర్ధిక సహాయాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది . ఉగ్ర దాడిని  సహించమని హెచ్చరించింది . 
పక్కనే వున్న చైనా  ఆదుకుంటుందని భావిస్తే భారత్ తో కలసి ఉగ్ర కార్యకలాపాలను ఆపేయవలసిందే . ఉగ్ర మూకలను తరిమేయవలసిందే అని హుకుం జారీ చేసింది . ఇండియా చర్యను సమర్ధించింది . ఇక రష్యా  ఎప్పుడు భారత మిత్ర దేశమే. . ఇవ్వాళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్  ఇమ్రాన్  ఖాన్ పై మండిపడ్డాడు . ఉగ్రవాదుల  విసయంలో రాజీ పడనని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు . 
పాకిస్తాన్ కు అన్ని దారులు మూసుకుపోయాయి . ఆపన్న హస్తం అందించేవారు కనబడటం లేదు . ఒకవేళ  యుద్ధమే మొదలైతే  పాకిస్తాన్ ఒంటరై పోవడం  ఖాయం . అన్ని దేశాలు భారత్ కే సపోర్ట్ చేస్తాయి .  భారత్ వైపు వచ్చి పోరాడతాయి . అదే జరిగితే పాకిస్తాన్  ఉనికి మిగలదు . ఈ విషయాన్ని ఇమ్రాన్  ఖాన్  గ్రహించాడు . అందుకే చర్చలకు సిద్ధమని కాళ్లబేరానికి వచ్చాడు . 
భారత  ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన విదేశీ విధానం ఇప్పుడు ఫలవంతమైంది . అన్ని దేశాలు భారత్ కు బాసటగా నిలబడ్డాయి . ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం పై అంతర్జాతీయ సమాజం , భారత్  ఎలా స్పందిస్తుందో చూడాలి !

Related posts