telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

ఇంటికోసం బ్యాంకు నుండి రుణం తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకుతీరాలి.. !

important things to get bank housing loan

సగటు మనిషికి సొంతిల్లు అనేది ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడం కోసం కొంత కూడబెట్టిన సొమ్ముకి తోడు మరి కొంత బ్యాంకు నుంచి అప్పుతీసుకోవడం జరుగుతుంది. మరి బ్యాంకు నుంచి రుణం తీసుకునేముందు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. బ్యాంకుకి వెళ్తే వాళ్లే చెబుతారు కదా అని అనుకోవద్దు. మనకి కూడా ఆ విషయం పట్ల కొంత అవగాహన ఉంటే మంచిది. రుణం తీసుకునేముందు తెలుసుకోవలసిన ప్రాథమిక నిబంధనలను గురించి తెలుసుకుందాం.

మీ ఆస్తి తాలుకూ పత్రాలను బ్యాంకు ఇంటి రుణం ఇచ్చే ముందు సరి చూస్తుంది. ఒక వేళ మీరు తీసుకున్న రుణం కట్టలేని పక్షంలో తిరిగి ఆ మొత్తాన్ని రాబట్టుకునేలా బ్యాంకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం బ్యాంకుకు సంబంధించిన ఓ వ్యక్తి వచ్చి మీ సైట్‌ని సందర్శిస్తారు. అతను మీరు తీసుకునే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌పై కోట్స్‌ను ఇస్తారు. అందుకోసం అతడు కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. దాన్ని లోన్‌కోసం దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది.important things to get bank housing loana

  • పేపర్ వర్క్ రుణం పొందేందుకు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బ్యాంకులు రుణం ఇచ్చే ముందే దరఖాస్తు దారుని నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. బ్యాంకుకు ఇంటికి సంబంధించిన పేపర్లన్నీ సమర్పించేముందే మీ దగ్గర కూడా ఓ సెట్ జిరాక్స్ తీసి పెట్టుకుంటే మంచిది.
  • ఒక బ్యాంకు నుండి ఇంటి రుణం పొందిన తరువాత వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, తక్కువ వడ్డీకే ఇంటి రుణం ఇస్తున్న వేరే బ్యాంకుకు మారడం మంచిది. ఇలా మార్చుకునేటప్పుడు మీరు తీసుకున్న రుణాన్ని బట్టి కొంత ఫీజు రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.
  • స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. మీరు కొనుగోలు చేసిన ఇంటి విలువను బట్టి స్టాంప్ డ్యూటీ ఆధారపడి ఉంటుంది. వాల్యుయేషన్ సంస్థనుంచి మీ అపార్ట్‌మెంట్ విలువ, కారు పార్క్ విలువ, ప్లోర్ రేటు వాల్యూ లాంటి అంశాలు ఉంటాయి.
  • ఇంటి రుణం మంజూరైన తరువాత దరఖాస్తు దారుడు చెల్లించవలసినవి చాలానే ఉంటాయి. ప్రాసెసింగ్ ఛార్జీలని, డాక్యుమెంటేషన్ ఛార్జీలని, చివరి చెల్లింపులని, ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణం మంజూరని, చట్టపరమైన ఫీజని కొంత, సాంకేతిక తనిఖీ రుసుమని కొంత బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇంటికి లోన్ తీసుకునే ప్రతి వ్యక్తికి బ్యాంకులు వసూలు చేసే ఫీజుల పట్ల అవగాహన ఉండాలి. కొన్ని బ్యాంకులు ఈ రుసుముని మాఫీ చేస్తాయి. అవి బ్యాంకుల మీద ఆధారపడి ఉంటుంది.

Related posts