telugu navyamedia
క్రీడలు వార్తలు

2019 లో జరిగిందే ఇప్పుడు జరుగుతుందా..?

అభిమానులు ఎంతగానో చూస్తున్న డబ్ల్యూటీసీ మ్యాచ్‌పై వరుణుడు కన్నెర్ర చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్‌లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యలో కొంత విరామం ఇచ్చినప్పటికీ- మళ్లీ మొదలైంది. దాంతో తొలి రోజు ఆట సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్, మీమ్స్‌తో ఐసీసీని ట్రోల్స్ చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో కూడా ఇలానే వర్షం వచ్చి భారత్ కొంపముంచిందని, మరీ ఈ సారి ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. వరుణుడి అంతరాయం కలిసొచ్చిందని, రిజర్వ్ డేలో పిచ్ అనూహ్యంగా పేస్, స్వింగ్‌ను అనుకూలించడంతో బోల్డ్, మ్యాట్ హెన్రీ చెలరేగారని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందని, ఈసారి భారత్ పరిస్థితి ఏంటోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంగ్లండ్‌లో జరిగిన ప్రతీ ఐసీసీ ఈవెంట్‌కు ఇదే పరిస్థితి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెగా ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Related posts