telugu navyamedia
సినిమా వార్తలు

ర‌వితేజ‌తో గోవా బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌..!

మాస్ మ‌హారాజ  రవితేజ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడీ”. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. యాక్షన్ డ్రామాగాలో రవితేజ సరసన డింపుల్ హయాతి హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Ileana D Cruz special song in Ravi Teja RamaRao On Duty

అటు ఈ మూవీ సెట్స్ పై ఉండగానే.. రవితేజ నటిస్తున్న మరో చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన థ్రిల్లర్ సినిమా. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో వేణు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది.

A fan asked Ileana D'Cruz if she ever faced flak for having an 'awkward  body', and here's what she had to say

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో గోవా బ్యూటీ ఇలియానా కన్పించబోతోందట. సమాచారం ప్రకారం ఒక ప్రత్యేక పాట కోసం “ఖిలాడీ” మేకర్స్ ఇలియానాను సంప్రదించారు. “కిక్”, “అమర్ అక్బర్ ఆంటోనీ”లలో రవితేజతో జత కట్టిన ఇలియానా ఐటమ్ పాట చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ఫైనాన్సియల్ అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయట.

I don't have a bikini body– Ileana D'cruz

గత కొంతకాలంగా పూర్తిగా సినిమాలకు దూరమైన ఇలియానా తనకు స్టార్ డమ్ ఇచ్చిన తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ మేరకు ఇలియానాతో తెలుగు దర్శకనిర్మాతల చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related posts