telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శృంగార పాఠాలు చెబుతున్న ఇలియానా…!

Ileana

గోవా బ్యూటీ ఇలియానా విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవలే ఇల్లి బేబీ ఆండ్రూ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు హల్చల్ చేశాయి. ఇక చాలా గ్యాప్ ఈ అమ్మడు త‌ర్వాత “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని” చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో తెలుగు సినిమా ఆఫ‌ర్స్ ఈ బ్యూటీకి కరువ‌య్యాయి. అయితే “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని” చిత్రంలో చాలా లావుగా క‌నిపించిన ఇలియానా ప్ర‌స్తుతం స్లిమ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. మళ్లీ తన పాత ఫిజిక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడేసింది ఇలియానా. మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని ఒకప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇల్లీబేబీ. అప్పుడు తాను చెప్పిన మాటలనే మళ్లీ ఇప్పుడు రిపీట్ చేసింది. సెక్స్ అనేది ఎవరైనా చేసుకుంటారు… కానీ అక్కడ ప్రేమ లేకపోతే అలా సెక్స్ చేసుకున్నా వేస్ట్ అంటుంది. తాను సెక్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని.. నిజానికి దాన్ని ఓ వర్కవుట్ మాదిరి చేస్తానని చెబుతుంది ఇలియానా. వర్కవుట్ అంటే తప్పుగా అనుకోవద్దని.. సెక్స్ అనేది ఇద్దరు మనుషులు కలయికే కాదు.. అదో అందమైన అనుభవం అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమ ఉన్న చోట సెక్స్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని.. ఎందుకంటే రెండు శరీరాలు కాదు.. రెండు ఆత్మలు అక్కడ కలిసుంటాయని చెబుతుంది ఈ భామ. అలా ఉన్నపుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుందని ఏ మాత్రం మొహమాటం లేకుండా సెక్స్ పాఠాలు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తనకు పూలంటే ఇష్టమని.. ఏ అబ్బాయిలు తనకు పూలు ఇవ్వడం లేదని కంప్లైంట్ చేస్తుంది. తన ఇష్టాన్ని తెలుసుకుని గోవాలోనే ఉన్న తన నాన్న ఎప్పటికప్పుడు తనకు పూలు పంపిస్తుంటాడని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Related posts