telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా బలం, బలహీనత నువ్వే… ఇలియానా భావోద్వేగ పోస్ట్

Ileana

గత కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ జంటగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ప్రస్తుతం ముంబైలో వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కలిసి దిగిన ఫోటోలను ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి “ఈ ఫోటో తీసిన నా హబ్బీ” అంటూ పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఇద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ విషయంపై ఇలియానాని ప్రశ్నించగా.. తనకు సమాధానం చెప్పడం ఇష్టం లేదని, తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగానే ఉంచాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ గోవా బ్యూటీ ఇలియానా తన తల్లి సమీరాకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. తన తల్లితో చిన్నప్పుడు, ఇటీవల దిగిన ఫోటోలను పోస్ట్ చేసి భావోద్వేగంగా కామెంట్ చేసింది. “నువ్వే నా బలం, నా బలహీనత. నా సర్వస్వం నువ్వే. నా కోసం ఎంతో కష్టపడ్డావు. నా కోసం నువ్వు చేసిన ఎన్నో పనులకు ధన్యవాదాలు. నీపై నా ప్రేమను తెలిపేందుకు మాటలు చాలవు. సూపర్ అమ్మ.. ఐ లవ్యూ” అంటూ ఇలియానా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను కేవలం రెండు గంటల్లో 1.3 లక్షల మంది లైక్ చేశారు.

Related posts