telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇల్లీ బేబీ బెల్లీ డ్యాన్స్… పాత లుక్ తో సోషల్ మీడియా షేక్

Ileana

గోవా బ్యూటీ ఇలియానా విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవలే ఇల్లి బేబీ ఆండ్రూ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు హల్చల్ చేశాయి. ఇక చాలా గ్యాప్ ఈ అమ్మడు త‌ర్వాత “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని” చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో తెలుగు సినిమా ఆఫ‌ర్స్ ఈ బ్యూటీకి కరువ‌య్యాయి. అయితే “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని” చిత్రంలో చాలా లావుగా క‌నిపించిన ఇలియానా ప్ర‌స్తుతం స్లిమ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. మళ్లీ తన పాత ఫిజిక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. ఇందులో ఇలియానాని చూసిన అభిమానులు నోరెళ్ల‌పెడుతున్నారు.

 

View this post on Instagram

 

Mood when I’m told I can have carbs today 💃🏻 @chandiniw @stacey.cardoz 😛

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

Related posts