telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రెండు సినిమాలు వదులుకోవడం వల్లే ఇలా… : ఇలియానా

Ileana

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో “దేవదాస్”తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోలతో జత కట్టింది. దక్షిణాదిలో హీరోయిన్‌గా పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌పై దృ‌ష్టి సారించింది ఇలియానా. అయితే అక్కడ పెద్దగా అవకాశాలు దక్కకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. అడపాదడపా అవకాశాలు వస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమె బాలీవుడ్‌లో విజయవంతం కాలేకపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రెండు సినిమాల్లో ఆఫర్లను ఇలియానా వదులుకుందట. ఆ రెండు సినిమాలు చేసుంటే బాలీవుడ్‌లో కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యుండేదాన్నని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. `సల్మాన్ ఖాన్ నటించిన `వాంటెడ్`, `కిక్` చిత్రాల్లో అవకాశాలు మొదట నాకే వచ్చాయి. అయితే ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రాలు చేయలేకపోయాను. అవి చేసుంటే కచ్చితంగా నేను స్టార్ అయ్యుండేదాన్ని` అని ఇలియానా చెప్పింది. `వాంటెడ్` సినిమా తెలుగు `పోకిరి`కి రీమేక్ కాగా, `కిక్` తెలుగు `కిక్`కు రీమేక్. ఈ రెండు తెలుగు చిత్రాల్లోనూ ఇలియానాయే కథానాయిక అన్న విషయం అందరికీ తెలిసిందే.

Related posts