telugu navyamedia
సినిమా వార్తలు

‘ఐఐటీ కృష్ణమూర్తి ‘  టీజర్ విడుదల..

IIT Krishnamurthy Teaser
పృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ‘. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు..  వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను  కె.ఎస్ రామారావు, విడుదల చేశారు.
కె.ఎస్‌ రామారావు మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీ  వర్ధన్  చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్. టీజర్ చూస్తే నే అర్థమవుతుంది .  టిజర్  లో ఏదో వుంది . హీరో హీరోయిన్ బాగున్నారు. టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు.రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘ఐఐటి కృష్ణమూర్తి’ టైటిల్ వెరైటీ గా టీజర్ ఇంటెన్స్ గా చాలా బాగుంది. మంచి  కాన్సెప్ట్ .‌ యూత్ అందరు కలిసి చెసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్ ను అందించాలని ఆశిస్తున్నానన్నారు. 
చిత్ర దర్శకుడు
 శ్రీ వర్దన్ మాట్లాడుతూ.. విచ్చెసిన గెస్ట్ లకు ధన్యవాదాలు. నేటి తరానికి నచ్చెలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తీశాము. నిర్మాత సపోర్ట్ అప్పటికి  మరచిపోలేము . అందరికి మా “ఐఐటి కృష్ణమూర్తి” నచ్చుతాడని నమ్ముతున్నామన్నారు.
సంగీత దర్శకుడు నరేష్ కుమారన్  మాట్లాడుతూ.. ఇదోక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందరు జెన్యూన్ గా  కష్టపడ్డామన్నారు.
చిత్ర సమర్పకులు ప్రేమ్ కుమార్ పాత్ర మాట్లాడుతూ..  ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ నీకూరి  తొలిసారి అయినా విషయం ఉన్న  మంచి సినిమా చేశారు. ఈ టీమ్ కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అన్నారు.
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‌ సినిమా ఫీల్డ్ నాకు కొత్త. ఈ చిత్ర దర్శకుడు రైటర్ పట్టుదల ,కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ . అది నచ్చి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేశారన్నారు. 
హీరో పృధ్వీ దండమూడి మాట్లాడుతూ.. నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్స్ ఈ చిత్రానికి రియల్ హీరోస్. నిర్మాత ప్రసాద్ గారు  అవగాహన లేకపోయినా  కథ పైన  తనకున్న  నమ్మకంతో  ఈ సినిమా చేశారు‌. అందరు కష్టపడి బెస్ట్ ఔట్పుట్ రావటానికి కృషి చేశాం. 
ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మల పల్లి రామ సత్యనారాయణ,  సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని , బాబ్జీ ,రామ్ రావిపల్లి  తదితరులు పాల్గొన్నారు
  పృద్వీ దండమూడి, మైరా దోషి,  వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి
దర్శకుడు : శ్రీ వర్ధన్,
సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర
నిర్మాత :  ప్రసాద్ నేకూరి,
బ్యానర్ :  క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ , సినిమాటోగ్రఫీ: యేసు.పి,
సంగీతం: నరేష్ కుమారన్,
ఎడిటర్ : అనిల్ కుమార్.పి
రచన : నాగార్జున మనపాక,
గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ,
లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి,
పి.ఆర్.ఓ : సాయి సతీష్

Related posts