telugu navyamedia
ఆరోగ్యం

జ్వరము దగ్గు జలుబు ఉంటే ఇలా చెయ్యండి

వర్షాలు కురిసినప్పుడు కొత్త నీరు వస్తుంది. ఆ నీరు తాగితే గొంతు పట్టుకోవడం, జ్వరము దగ్గు జలుబు రావడం సహజం. ఇలాంటివి రాగానే పెద్ద డాక్టర్ దగ్గరకు పరిగెడుతుంటారు. ఖరీదైన మందులు వాడితే కానీ నయం కావని చాలామంది నమ్ముతారు. ప్రతి చిన్న అనారోగ్యానికి డాక్టర్ ను సంప్రదించడం అలవాటైపోయింది. ఇలాంటివి ఇప్పుడే కాదు ఎప్పటినుంచో వున్న జబ్బులే. కానీ మూడు, నాలుగు తరాల క్రితం, ముఖ్యంగా పల్లెటూళ్లలో జ్వరం, దగ్గు, జలుబు లేదా గొంతు పట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే కంగారు పడేవారు కాదు. అవి నయం కావడానికి డాక్టర్ దగ్గరకు పరిగెత్తి డబ్బులు సమర్పించుకొనేవారు కాదు. వంటింటి చిట్కాలను ఉపయోగించి వాటిని నయం చేసేవారు.

ఇప్పుడు మన అన్ని విధాలుగా అభివృద్ధి చెందాం. రోగాలకు తగిన మందులను కూడా కనుక్కుంటున్నారు. అయినా పాతతరం వారు మాత్రం వంటింటి వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు . మీకు ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వంటింటి వైద్యం చేసి చూడండి.

*తిప్పతీగ జానెడు పచ్చిది దొరకకపోతే పొడి రెండు చెంచాలు, తులసి ఆకులు 10 అల్లం 5 గ్రాములు మిరియాలు- 5. నేల వేము-2 చిటి కలు,పటిక బెల్లం 10గ్రాములు, గ్లాసు నీళ్ళు (200ML) తీసుకొని, చిన్న మంట పై సగం అయ్యేవరకు మరిగించాలి. ఆ తరువాత వడ పోసుకొని, ఆహారం సేవించడానికి ముందు రెండు పూటలా తగ్గే వరకు వాడాలి.

*మందులు వాడే సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

*డ్రై ఫ్రూట్స్ బాగా తినండి, అలాగే రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగాలి, రెండు పూటలా నీటి ఆవిరి పట్టాలి

* గొంతునొప్పిగా ఉంటే అర గ్లాసు నీళ్ళలో మెంతులు ఒక చెంచా వేసి మరిగించి, కొద్దిగా చల్లారిన తర్వాత, పుక్కిలించి ఊయండి మీ మీ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ ఇట్టే తగ్గిపోతుంది.

Related posts