telugu navyamedia
ఆరోగ్యం

ఆఫీస్ లో స్నాక్స్ ఎక్కువగా తింటున్నారా ?

If you eat too much of snacks at office
సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలు మధ్యలో రకరకాల చిరు తిళ్ళు తింటుంటారు. దీంతో వారిలో క్యాలరీలు బాగా పెరిగిపోతాయి. ఇలా స్నాక్స్ తినడం వల్ల మహిళల్లో సంవత్సరానికి లక్ష క్యాలరీలు పెరుగుతున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో పని చేసేటప్పుడు మధ్య మధ్యలో చాలామంది ఆడవాళ్లు బిస్కట్లు తింటుంటారు. ఒకటి రెండి అయితే ఫరవాలేదు కానీ దానికి మించి తింటే శరీరానికి మంచిది కాదు. ఎందుకంటే బిస్కట్లను వెజిటబుల్ ఆయిల్, పంచదార, మైదాపిండితో తయారుచేస్తారు. కాబట్టి ఎక్కువగా తింటే బరువుతోపాటు శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరుతాయి.
పాలు, కాఫీకి కూడా దూరంగా ఉండాలి. ఇది ఒక కప్పు తాగినా శరీరంలో క్యాలరీలు బాగా పెరుగుతాయి. ఒక చిన్న కప్పుతో తాగిన మిల్కుకాఫీలో 80-100 క్యాలరీలు ఉంటాయి. రోజులో మనం తీసుకునే ఒక అదనపు మీల్‌తో ఇది సమానం. కేక్స్ కూడా బాగా తింటుంటారు. సింగిల్ కేక్‌లో 10-12 గ్రాముల ఫ్యాట్, 300 నుండి 400 క్యాలరీలు కూడా అందులో ఉంటాయి. వీటిని వారంలో ఓ నాలుగైదుసార్లు కంటే ఎక్కువగా తింటే బరువు పెరగడం ఖాయం. అందుకే ఆఫీస్ లో చిరు తిండ్లకు దూరంగా ఉండండి.

Related posts