telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వేసవిలో చల్లగా.. ఐస్ ఆపిల్స్ .. తినాల్సిందే..!

ice apples and their uses in summer

ఎండాకాలం వచ్చేసింది. వామ్మో అనుకునేలోగానే, ఈ సీజన్ లో లభ్యమయ్యే అనేక ఆహారాలను కూడా ప్రకృతి సిద్ధం చేసింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ఐస్ ఆపిల్; అంటే ఏమిటో అనుకోకండి.. అదేనండి తాటిముంజలు. వేసవిలో విరివిగా దొరుకుతాయి. చక్కగా జీర్ణం అవుతాయి. త్వరగా శక్తినిచ్చే ప్రకృతి సిద్ద ఆహారం. వీటివలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుందంటే నమ్మగలరా? ఔనండి.. ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు. ఈ తాటి ముంజలలో అద్భుత ఔషధ గుణాలు ఉండడం వల్ల వీలైతే వీటిని ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి. సాధారణంగా తాటి ముంజలను ఇష్టపడని వారు ఉండరు.
ice apples and their uses in summerతాటి ముంజల వల్ల కలిగే ప్రయోజనాలు :
* తాటి ముంజలు శరీరంలో అధికంగా పేరుకున్న కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
* ముంజల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది, రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* ఇందులో ఉండే ఏ, బీ, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలును చేకూరుస్తాయి.
* తాటి ముంజలను తినడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
* గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి, చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిది.
* లివర్ సమస్యలతో సతమతమవుతున్న వారు తీసుకుంటే మంచిదట.
* మొటిమలతో బాధపడుతున్న వారు తాటి ముంజలు లభించినన్ని రోజులు వాటిని తింటే తగ్గుముఖం పడతాయి.
* ఎండ వేడిమి వల్ల శరీరంలో కలిగే గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారిస్తుంది.
* తాటి ముంజలో ఉండే పొటాషియం శరీరంలో పేరుకుని ఉన్న విషపదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
* మండే ఎండల కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. ఆ సమయంలో ముంజలు తింటే శారీరక ఉపశమనం పొందవచ్చు.
* కేన్సర్ కణాల నిరోధానికి సైతం ముంజలు ఉపయోగపడతాయి. ట్యూమర్, బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివ‌ృద్ధి చేసే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి.

Related posts