telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

27 ఏళ్ళ సర్వీసులో… 52 సార్లు బదిలీ.. ఐఏఎస్ అధికారి..

ias transferred since his sincerity

దేశంలో నిజాయితీకి దొరికిన బహుమతి అంటే ఉద్యోగ బదిలీనే. అలాంటి బహుమతి ఉన్నత ఉద్యోగులకు సహజం, అంటే ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి అధికారులకు బదిలీలు సర్వసాధారణం. కానీ ఓ ఐఏఎస్‌ అధికారి సర్వీసులో చేరిన 27ఏళ్లలో 52 సార్లు బదిలీ అయ్యారు. నిజాయతీగా పనిచేస్తూ అవినీతిని బయటపెట్టడమే ఇందుకు కారణం. ఆయన పేరు అశోక్‌ ఖేమ్కా. పశ్చిమ్‌బంగాలోని కోల్‌కతాకు చెందిన అశోక్‌ 1991లో హరియాణా కేడర్‌ నుంచి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

విధుల్లో చేరిన నాటి నుంచి నిజాయతీగా పనిచేస్తూ అనేక కుంభకోణాలను బయటపెట్టారు. దీనితో ఆయనకు బదిలీలు తప్పలేదు. 2012లో రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ, ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు జరిగిన భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో అశోక్‌ పేరు మార్మోగింది. ఆ తర్వాత కూడా అశోక్‌ను అనేకసార్లు బదిలీ చేశారు. 15 నెలల క్రితమే హరియాణా క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అశోక్‌ను తాజాగా.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.

దీనితో తన 27ఏళ్ల కెరీర్‌లో ఇది 52వ బదిలీ కావడం గమనార్హం. అశోక్‌తో పాటు మరో 8 మంది ఐఏఎస్ అధికారులను హరియాణా ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది.

Related posts