telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోలీస్‌స్టేషన్‌లో యువకుడిని చితకబాదిన కలెక్టర్..నెట్టింట్లో వీడియో వైరల్

Kashmiri men thrashed Hindu Dal

పశ్చిమ బెంగాల్ లో ఓ కలెక్టర్ రెచ్చిపోయాడు. అతని భార్యపై ఫేస్ ప్రొఫైల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఓ యువకుడిని పోలీస్‌స్టేషన్‌లో చితకబాదాడు. అలీపూర్‌దౌర్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ నిఖిల్ నిర్మల్, అతని భార్య ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఎటువంటి ఫిర్యాదూ చేయకుండానే విచారణ పేరిట యువకుడిని చిత్ర హింసలు పెట్టారు. ఫలకటా పోలీస్ స్టేషన్‌లో సీఐ సౌమ్యజిత్ రే ఎదురుగానే కలెక్టర్ ఆ యువకుడిని కొట్టడం విశేషం.

కలెక్టర్ భార్య ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై ఏవో కామెంట్స్ చేశాడన్న కారణంతో యువకుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడికి వెళ్లిన కలెక్టర్, అతని భార్య అతన్ని దారుణంగా కొట్టారు. నీ ఇంట్లోకి వచ్చి మరీ చంపుతా అని కలెక్టర్ ఆ యువకుడిని బెదిరించాడు. ఈ పని చేయమని నీకు ఎవరు చెప్పారో చెప్పాలంటూ అతని భార్య కూడా యువకుడిని మందలించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో కలెక్టర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts