telugu navyamedia
సినిమా వార్తలు

నా ఫ్రెండ్స్ లో లెస్బియన్లు ఉన్నారు : రెజీనా

Regina

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శౌర్య, సౌఖ్యం, అ! లాంటి సినిమాలతో టాలీవుడ్ లో హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది రెజీనా. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రెజీనా నటించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా మీడియాతో మాట్లాడుతూ పెళ్లి, జయలలిత బయోపిక్ లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు, లెస్బియన్లపై తన అభిప్రాయం తదితర విషయాలను పంచుకుంది. తన విషయంలో పెళ్ళి కానీ, నిశ్చితార్థం కానీ… వాటి గురించి బాహాటంగానే చెబుతానని, తాను జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నానే వార్తలు పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది. “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించడం ఆనందంగా ఉందని, తన స్నేహితుల్లో కొంతమంది ఎల్జీబీటీ కమ్యునిటీకి చెందిన వారున్నారని.. సినిమా చూసి ఉద్వేగానికి గురయ్యారని తెలిపింది. ఇలాంటి సామాజికపరమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సినీ మాధ్యమం బలమైన శక్తిగా పని చేస్తుందని రెజీనా అన్నారు.

Related posts