telugu navyamedia
రాజకీయ వార్తలు

మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతా: మోదీ

modi campaign in mahaboob nagar

తాను కేవలం మూడున్నర గంటల పాటు మాత్రమే నిద్రపోతానని ప్రధాని మోదీ చెప్పారు. రిటైరైన తర్వాత ఎక్కువ సేపు నిద్రపోయేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. బుధవారం సినీ నటుడు అక్షయ్ కుమార్ మోదీని ఇంటర్వ్యూ చేశారు. సుదీర్ఘకాలం పాటు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ తాను తన దుస్తులను తానే ఉతుకున్నట్టుగా మోడీ చెప్పారు. తన శరీరం తక్కువ కాలం పాటు నిద్రపోయేందుకు అలవాటైందన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తనకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల ప్రధానమంత్రిగా తనకు కలిసివచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేవేగౌడ కూడ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పారు. కానీ ఆయన తక్కువ కాలం పాటు మాత్రమే కర్ణాటక సీఎంగా కొనసాగారని ఆయన తెలిపారు. తాను పనిచేస్తూ అందరితో పనిచేయిస్తుంటానని మోదీ పేర్కొన్నారు.

Related posts