telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమలో మోసపోయా… : రాయ్ లక్ష్మీ

Raai-Lakshmi

సౌత్ లో అందాలను ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న నటి రాయ్ లక్ష్మీ. పలు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఇటీవలే తెలుగు “వేరీజ్ వెంకట లక్ష్మీ” సినిమాతో మరోసారి పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఆమెను వరుసగా సినిమా అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మీ తాను ప్రేమలో మోసపోయినట్టుగా తెలిపింది. తనపై వచ్చే పుకార్లపై స్పందిస్తూ ఒకటి కాదు, వందల, వేల సంఖ్యలో తనపై పుకార్లు వస్తుంటాయని, తను గర్భవతి అనే ప్రచారం కూడా జరిగిందని, చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నానని వార్తలు రాస్తున్నారని చెప్పుకొచ్చింది. ఏ స్త్రీ అయినా.. ఒకరికన్నా ఎక్కువ మందితో రిలేషన్షిప్ చేయగలదా..? అది సాధ్యమయ్యే పనేనా..? ఇవేవీ ఆలోచించకుండా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు మండిపడింది. ప్రేమ విషయంలో రెండు, మూడు సార్లు మోసపోయిన మాట నిజమేనని, ఆ తరువాత తన తప్పు తెలుసుకొని సంబంధాన్ని తెంచుకున్నట్లు, ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం సినిమాల మీదనే అంటూ చెప్పుకొచ్చింది.

Related posts