telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్వారంటైన్‌లో కమల్ హాసన్

Kamal-Hassan

చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లో ఉన్న కమల్ హాసన్ ఇంటికి చెన్నై కార్పోరేషన్ ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌ను అతికించింది. కొంత సేపటి తరవాత ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ లోపలే ఆ సమాచారం అభిమానుల దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో తమ హీరోకు ఏమైందనే భయంతో ఎంక్వైరీలు మొదలుపెట్టారు. విషయం కమల్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. అభిమానులనుద్దేశించి ఒక ప్రకటనను విడుదల చేశారు. నా ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల నేను క్వారంటైన్‌లో ఉన్నానని ఒక వార్త వ్యాపించింది. కానీ, నేను కొన్నేళ్లుగా ఆ ఇంట్లో ఉండటం లేదని మీలో చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్‌లో ఉన్నాను అని వచ్చిన వార్తలు అవాస్తవం అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగాంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు.ఇటీవల లండన్ నుంచి వచ్చిన శృతిహాసన్ తాను, తన తల్లి సారిక ముంబైలో వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నామని చెప్పారు.

Related posts