telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్దస్త్” నుంచి పంపించేస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు…: హైపర్ ఆది

Hyper-Adi

పవర్ ఫుల్ పంచ్‌లతో ప్రేక్షకులను “జబర్దస్త్”గా నవ్విస్తాడు హైపర్ ఆది. అతని కామెడీ స్కిట్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం టీవీ రేటింగ్‌ల పరంగానే కాదు, యూట్యూబ్‌లో స్కిట్ రిలీజైన రెండు రోజులవరకు అదే ట్రెండింగ్. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు ఆది. నాగాబాబు, రోజా, అనసూయల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అలాగే జబర్దస్త్ నుంచి మిమ్మల్ని పంపించేస్తే ఏం చేస్తారన్న యాంకర్ ప్రశ్నకు.. స్పందిస్తూ “దాని నుంచి మనమే వెళ్లిపోవాలి తప్పించి.. వాళ్లు పంపించరు. ఒక వేళ అలా పంపించేస్తే.. ఎక్కడికెళ్లినా.. ఏదైనా చేయగలం అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను బాగా చదువుకున్నా.. అన్నీ తెలిసిన వాళ్లం కాబట్టి.. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలో తెలుసు. కాబట్టి.. ఏ ఫీల్డ్ కెళ్లినా నేను రాణించగలననే నమ్మకం నాకుంది. వాళ్లు నన్ను పంపించేశారు.. ఇప్పుడు నేనేం చేయాలనే కంగారు, భయాలు అయితే నాకు లేవు” అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

Related posts