telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది…

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు హైపర్ ఆది. తెలంగాణ బతుకమ్మ, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించాడు. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని స్పష్టం చేశాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడు ఉండవు అని తెలిపాడు. అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ ఉంటాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. అవి మేము కావాలని చేసినవి కావు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానుల వలనే మేము వారిని ఇంతలా ఎంటర్టైన్మెంట్ చేయాగలుగుతున్నాము. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరపున నిర్మోహమాటంగా క్షమాపణ కోరుతున్నానని అన్నారు.

Related posts