telugu navyamedia
సినిమా వార్తలు

శివాజీరాజాకు “హైపర్” ఆది కౌంటర్ 

Hyper Aadi,Shivaji Raja
జనసేన తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న నాగబాబుకు ఓటేయవద్దని నరసాపురం ప్రజలకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ వీరాభిమాని, “జబర్దస్త్” నటుడు హైపర్ ఆది శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చారు. సీనియర్ నటుడిగా తనకు శివాజీరాజా అంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని, కానీ నాగబాబు గురించి ఆయన చెప్పినవన్నీ అవాస్తవమని, ఎవరి భిక్షంపై రెండేళ్లు “మా” అధ్యక్షుడుగా శివాజీరాజా పనిచేశారో చెప్పాలని ప్రశ్నించాడు.
చిరంజీవి అంటే తనకు ఇష్టం అంటూనే నాగబాబును తిడితే చిరంజీవికి నచ్చుతుందా ? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటూనే నాగబాబును తిడితే పవన్ కళ్యాణ్ కు ఇష్టం ఉంటుందా ? మెగా బ్రదర్ ను తిడుతుంటే నాలాంటి మెగా ఫ్యాన్స్ కు నచ్చుతుందా ? అంటూ కౌంటర్ ఇచ్చాడు. నాగబాబు పిల్లికి భిక్షం పెట్టడు అనడం సరికాదని, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఒకరికి మూత్రపిండం ఆపరేషన్ కోసం నాగబాబు పది లక్షల రూపాయలిచ్చారని తెలిపాడు. ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయాననే అక్కసుతోనే ఇలా మాట్లాడుతున్నారని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు ఆది. అంతేకాదు దమ్ముంటే నరసాపురం సెంటర్‌కు వచ్చి మాట్లాడాలని, ఎవరిని ఎవరు తరిమి కొడతారో తెలుస్తుందని హైపర్ ఆది సవాల్ విసిరాడు. మరి ఈ వ్యాఖ్యలకు శివాజీరాజా ఎలా స్పందిస్తారో చూడాలి

Related posts