telugu navyamedia
crime news Telangana

హైదరాబాద్ లో మరో భారీ మోసం..రూ.100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ

Hyderabad Wisdom Jobs Portal Cheat youth

విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ నిరుద్యోగ యువతీ యువకులకు వల వేసింది. భారత్ తో పాటు అమెరికా, యూరప్ లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో డబ్బులు కట్టి ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో హైదరాబాద్ కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజ్డమ్ జాబ్స్ పోర్టల్ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంది. తమకు 4,000 మంది విదేశీ క్లయింట్లు ఉన్నారనీ, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బరోసా కల్పించింది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ఈ పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. విజ్డమ్ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేసి మీకు ఫలానా కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది. ఇందుకోసం ప్రీమియంగా మీరు ఇంత మొత్తం చెల్లించాలి. నగదు చెల్లింపులు పూర్తయ్యాక ఇంటర్వ్యూ నిర్వహిస్తాం అంటూ బాధితులకు ఫోన్ కాల్స్ చేసేవారు. మీ రెజ్యుమెను అప్ డేట్ చేయడానికి ఇంత చెల్లించాలనీ, ఇంటర్వ్యూ కోసం మరికొంత చెల్లించాలని ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియపరిచేవారు.

వీరి మాటలు నమ్మిన యువతీయువకులు రూ.1,000 నుంచి రూ.లక్ష వరకూ నగదును సమర్పించుకున్నారు. అయితే తమ గుట్టు బయటపడకుండా విజ్డమ్ నిర్వాహకులు అప్పుడప్పుడూ సొంత మనుషులనే విదేశీ కంపెనీ ప్రతినిధులుగా చూపుతూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. చివరికి డబ్బులు కట్టినా ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో హైదరాబాద్ కు చెందిన ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అధికారులు.. విజ్డమ్ జాబ్ పోర్టల్ యజమాని అజయ్ కొల్లాంను అరెస్ట్ చేశారు.

Related posts

అమెరికాలో భారత సంతతి బాలికపై వెల్లువెత్తిన మానవత్వం

vimala p

నీరవ్ మోదీ .. బ్యాంకులలో కోట్ల రూపాయలు..ఖాతాలు స్తంభింపచేసిన ఈడీ ..

vimala p

జయరాం హత్యకేసులో… విచారణ ఎదుర్కొన్న నటుడు పింగ్ పాంగ్ సూర్య ..!

vimala p