telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్.. రైతు బజార్లు కిటకిట!

Marketa rythu bazar Hyd

ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనం ముందస్తు కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైతు బజార్లు ఈరోజు ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరుకులు లభించవేమోనన్న ఆందోళనతోపాటు ధరలు పెంచేస్తారేమోనన్న భయంతో చాలామంది ఉదయాన్నే మార్కెట్‌ బాటపట్టారు. దీంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంది. ఇదే అదనుగా దళారులు ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.

నాలుగు రోజుల క్రితం పదిరూపాయల కంటే తక్కువ ఉన్న టమాటా ధర ఏకంగా నలభై రూపాయలకు పెంచేశారు.హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, ఖమ్మం, వరంగల్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లోని రైతు బజార్లలో ఒకేలాంటి పరిస్థితి దర్శనమిచ్చింది. దాదాపు వారంపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుండడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు జనం బారులు తీరారు.

Related posts