telugu navyamedia
crime news political Telangana

బంజారాహిల్స్‌లో రూ.3.5 కోట్ల హవాలా మనీ పట్టివేత!

Hyderabad Police Seize Three Crores

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగల వ్యాపారి అనిల్‌ అగర్వాల్‌ ఇంట్లో రూ. 3.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా ద్వారా డబ్బులు పంచుతున్నట్టు పోలీసుల గుర్తించారు. పట్టుబడిన నగదును బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా హవాలా ద్వారా డబ్బులు పంచుతున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ప్రకాశ్‌ అనే వ్యక్తికి అనిల్‌ అగర్వాల్‌ ఇదివరకే రూ.కోటి ఇచ్చినట్లుగా విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అయితే ఆ కోటి రూపాయలు ఎక్కడికి తరలించారో తెలియరాలేదు. ​​ఎన్నికల్లో అభ్యర్థులకు ఇచ్చేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Related posts

ఏపీ ఏజీ .. రాజీనామా ఆమోదం..

vimala p

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు!

vimala p

రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ .. 15 నుండి నిలుపుదల.. : ఐ.ఆర్.డి.ఏ.ఐ

vimala p