telugu navyamedia
క్రైమ్ వార్తలు

సైదాబాద్‌ చిన్నారి రేప్‌ కేసులో పోలీసుల కీలక నిర్ణయం..

హైద‌రాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ బాలికపై లైంగికదాడి, హత్య కేసు తీవ్ర‌క‌ల‌కం రేపుతోంది. ఘటన జరిగి వారం కావస్తున్నా.. నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అయితే నిందితుడి పై రివార్డు ప్రకటించింది హైదరాబాద్ పోలీస్‌ శాఖ.

Saidabad rape case: Hyderabad police announce Rs 10 lakh reward for info on  accused | The News Minute

నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు ఇస్తామంటూ రివార్డు ప్రకటించారు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్.. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసుపై కీలక సమీక్ష నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు. నిందితుడి ఆచూకీ తెలిస్తే ఈస్ట్‌ జోన్‌ డీసీపీ 94906 16366, టాస్క్‌ ఫోర్స్‌ 94906 16627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లను తెలుపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు.

Rs 10 lakh reward for info on accused in 6-year-old's rape, murder case

నిందితుడి వయసు 30 సంవత్సరాలని, ఎత్తు 5.9 అడుగులు ఉంటాడని, మెడలో భుజాలపై రెడ్‌ కలర్‌ స్కార్ఫ్‌ వేసి ఉంటుందని, రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మద్యం సేవించడం.. బస్టాండ్లలో నింద్రించడం అలవాటు చేసుకున్నాడని తదితర వివరాలు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు.

కాగా.. ఆరురోజులైన నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు.

Rs 10 lakh reward for info on accused in 6-year-old's rape, murder case

Related posts