telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం!

gun fire

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై నార్సింగ్ సమీపంలో గురువారం కాల్పుల కలకలం రేగింది. ఓ బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. టీఎస్09యుబి6040 అనే బెంజ్ కారులో ఔటర్ రింగ్ రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి కారును ఆపేసి తనకు తానుగా కాల్చుకున్నాడు. మొదట ఇదేదో గ్యాంగ్ వార్ అనుకుని భయపడిన స్థానికులు, ఆ తర్వాత కారువద్దకు వచ్చి చూడగా అపస్మారక స్థితిలో వ్యక్తి కనిపించాడు.

తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కారులో లభించిన వివరాల ఆధారంగా జైన్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆ కారు అద్దెకు తీసుకున్నదిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కారు యజమాని ఎవరో గుర్తించి, వివరాలు సేకరిస్తున్నారు.

Related posts