telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

నేరేడ్‌మెట్ లో సైకిల్ తొక్కుతూ బాలిక అదృశ్యం!

gril missing

మేడ్చెల్ జిల్లా నేరేడ్‌మెట్ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఓ బాలిక అదృశ్యమైంది. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక సుమేధా కాపూరియా (10) ఆచూకీ నిన్న సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటికి రాలేదు. దీంతో చిన్నారి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలిస్తున్నారు.

సైకిల్ తొక్కుకుంటూ ఉన్న బాలిక దాదాపు గంటపాటు అదే ప్రాంతంలో తిరిగినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని బట్టి తెలుస్తోంది. అయితే, ఆ ప్రాంతం దాటిన తర్వాతే బాలిక అదృశ్యమైనట్టు సమాచారం.నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైకి నీరు చేరడంతో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో కానీ, పొరపాటున నాలాలో కానీ పడిపోయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు సమీపంలోని నాలాల్లో గాలిస్తున్నారు.

Related posts