telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నాంపల్లి స్టేషన్ దగ్గర కూలిన పురాతన భవనం

హైదరాబాద్ నగరంలో ఓ పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పురాతన సరాయి బిల్డింగ్ ఉన్నపళంగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts