telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మెట్రో వివరాలు ఇక.. పేటియం లో కూడానట..

hyderabad metro information in ptm app

హైదరాబాద్ మెట్రోరైలుకు సంబంధించి రాకపోకల వివరాలు ఇక నుండి పేటీఎం యాప్ ద్వారా కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికే మెట్రోరైలు సదుపాయం ఉన్న ఢిల్లీ, నోయిడా, గురుగావ్, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, ముంబై, చెన్నై, లక్నో, కొచ్చి, జైపూర్‌లో అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇక నుంచి హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కొత్తగా అందు బాటులోకి తెచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రయాణికుడు ప్రయాణించే రూట్లకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను మాత్రమే సూచించడమే కాకుండా, ప్రయాణ సమయం అంచనా, చార్జీలు, మధ్యలో వచ్చు స్టేషన్ల సంఖ్య, లైన్ల మార్పిడి కోసం ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ల వివరాలను యాప్ ద్వారా పొందవచ్చు. గమ్యం తొందరగా చేరడానికి ఎంచుకోవాల్సిన రూటును కూడా స్పష్టం చేసింది. ప్రయాణంలో రూటు మార్చాల్సి వస్తే దాని వివరాలు అందిస్తుంది.

పేటీఎం వైస్ ప్రెసి డెంట్ అభిషేక్ రాజన్ మాట్లాడుతూ మెట్రో రూట్ సెర్చ్ అనేదీ మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తెలివిగా ప్లాన్ చేసుకునేందుకు ఒక సౌకర్యవంతమైన పద్ధతిని అందించే దిశలో మరొక అడుగని తెలిపారు. బస్సు, రైలు, విమానం సేవలకు సంబంధించి లైవ్ ట్రైన్ ట్రాకింగ్, క్విక్ బుక్, వాయిస్ సెర్చ్ వంటి సులభ పద్థతులు కూడా పేటీఎం యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఇదెలా ఉపయోగించాలంటే.. పేటీఎం యాప్‌లో మెట్రో ఐకాన్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై కనబడే దానిలో హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుని రూట్ సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరు ఉన్న స్థానం మీ గమ్య స్థానాన్ని ఎంచుకోవాలి. రూట్స్ చూడటానికి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి. యాప్‌లో రూట్‌తోపాటు ఎంపిక చేసుకున్న స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని కూడా చూపిస్తుంది.

Related posts