telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం .. కేరళ నుంచి హైదరాబాద్ కు నర్సులు

karona chekup hospital

తెలంగాణలో కరోనా కరోనా ఉగ్రరూపం దాల్చడంతో నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఓవైపు నర్సుల కొరత ఏర్పడింది. దాంతో హైదరాబాదులోని రెండు ప్రైవేటు ఆసుపత్రులు కేరళ నుంచి హుటాహుటీన 50 మంది నర్సులను చార్టర్డ్ విమానాల్లో తీసుకువచ్చాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో నర్సులకు ప్రాధాన్యత ఏర్పడింది. వారికి అధిక వేతనాలను ఇచ్చేందుకు కూడా ఆసుపత్రుల యాజమాన్యాలు సిద్ధపడుతున్నాయి.

దీనిపై తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ రుడావత్ మాట్లాడుతూ, తాత్కాలిక ప్రాతిపదికన అయినా నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కో నర్సుకు రూ.50 వేల వరకు జీతం ఆఫర్ చేస్తున్నాయని వెల్లడించారు. సాధారణంగా నర్సులకు ఇచ్చే జీతానికి ఇది మూడు రెట్లు ఎక్కువని అన్నారు.

Related posts