telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

దళితబంధుకు కేంద్రం నిధులిస్తే మోదీకి పాలాభిషేకం చేస్తా: హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్‌రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్‌ విసిరారు హరీశ్‌రావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు అవుతున్న‌ప్ప‌టికీ ద‌ళితులు వివ‌క్ష‌కు గుర‌వుతున్నారు. పేద‌రికాన్ని రూపుమాపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ద‌ళితుల‌ను బాగు చేసేందుకు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని తీసుకొచ్చామ‌న్నారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 20 వేల కుటుంబాల‌కు ద‌ళిత బంధు అమ‌లు చేస్తామంటే.. బీజేపీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆరునూరైనా స‌రే అర్హ‌త క‌లిగిన ప్ర‌తి కుటుంబానికి ద‌ళిత బంధు అందించి తీరుతాం.

ద‌ళితుల‌పై నిజంగా ప్రేమ ఉంటే.. ఈ ప‌థ‌కాన్ని ఎందుకు ఆహ్వానించ‌లేదు అని ప్ర‌శ్నించారు. ఈ ప‌థ‌కాన్ని ఆపాల‌ని హైకోర్టులో కేసులు వేశారు. ఈసీకీ లేఖ‌లు రాస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి రోడ్ల మీదికి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ద‌ళిత బంధును నూటికి నూరు శాతం ఇవ్వాల‌ని కేబినెట్‌లో ఆమోదించాం. అత్యంత పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్దతుల్లో ఈ ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్‌ విసిరారు హరీశ్‌రావు. దళితబంధుకు కేంద్రం నుంచి నిధులు తెస్తే.. మోదీ ఫొటోకు పాలాభిషేకం చేస్తానన్నారు.

Related posts