Husband Commits Suicide for Don't do Chatting Every Time

భార్య భర్తను మందలించిందని ఆత్మహత్య… చాటింగ్ తో మనస్పర్థలు

పెళ్ళై రెండు నెలలు కూడా గడవలేదు ఓ వివాహితపై పుట్టెడు దుఃఖం మిగిల్చి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి.. ఆత్మహత్యకు కారణం ఎలా ఉందంటే చెబితే మీరే ఆలోచిస్తారు.. ఈ కారణానికి ఆత్మహత్య చేసుకుంటాడా అని… తరచుగా ఫోన్లో ఛాటింగ్ చేస్తుండేవాడు… దీనితో భార్యాభర్తల ఇద్దరిమద్యలో మనస్పర్థలు వచ్చాయి… శనివారం రోజు నిత్యం ఫోన్ లో చాటింగ్ ఎందుకు చేస్తున్నావని భార్య మందలించేసరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు అని ప్రాథమిక విచారణలో తేలింది.. వివరాల ప్రకారం…

మారేడుపల్లి పోలీస్స్టేషన్ పరిధి సంజీవయ్య నగర్ కు చెందిన శివకుమార్ అలియాస్ చిన్నా (27) ఎలక్ట్రీషియన్ కు లహరి అనే యువతితో గత నెల ఆగస్టు 15న వివాహం జరిగింది.. పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు.. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.. దానికి కారణం శివకుమార్ తరచుగా ఫోన్లో ఛాటింగ్ చేస్తుండేవాడు.. భార్య మందలించేది.. దీనితో ఏమైందో ఏమో తెలియదు కానీ శనివారం శివకుమార్ మరోక రూమ్ లోకి పోయి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..

కాగా లహరి ఎన్నిమార్లు పిలిచినా పలుకక పోవడం తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో తలుపులను పగులగొట్టి చూడగా అప్పటికే శివకుమార్ మృతిచెందాడు… కాగా ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *