• Home
  • వార్తలు
  • వరద ముప్పులో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు…
రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

వరద ముప్పులో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు…

hurricane warining to ap state

కేరళలో గత వరదలు మిగిల్చిన అవశేషాలు ఇంకా తొలగి పోకముందే మరోసారి ముప్పు సమీపిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలలో ఉన్న నదులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. వర్షాభావ స్థితికి ఈ నీరు అనేక లోతట్టు ప్రాంతాలను ముంచే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది కేంద్రం. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రంగంలోకి దిగిన అధికారులు నది జలాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తమిళనాడులో కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అక్కడి నదీపరివాహక ప్రాంతాలలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనితో ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాలలో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కోయంబత్తూరు, కాంచీపురం, కన్యాకుమారి, చెన్నై, తిరువళ్లూరు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నీలగిరి, ఊటీ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండాటాతో రాకపోకలు నిలిపివేశారు.

Related posts

రాజీనామాలు ఈ సాయంత్రం ప్రధానికే..

admin

ప్రభుత్వానికి గిరిజనుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వాళ్ల ప్రాణాలపై లేదు: రోజా

madhu

కేసీఆర్ మరో శిశుపాలుడు: జగ్గారెడ్డి

madhu

Leave a Comment