telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ .. జార్ఖండ్‌ ను కూడా .. చేజార్చుకున్నట్టే .. ఎగ్జిట్ పోల్స్ ..

hung exit polls in jharkhand

రాష్ట్రంలో అధికార బీజేపీ విపక్షానికే పరిమితం కానుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సగటున బీజేపీ 28 సీట్లతో విపక్షానికే పరిమితం అవుతుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్ కూటమి 38 సీట్లతో అధికారానికి మూడడుగుల దూరంలో నిలుస్తోందని అంచనా వేశాయి. పోల్ డైరీ, సోషల్ ఇనిషియేటివ్ ఫర్ ఇండియా.. కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తోందని లెక్కగట్టాయి. అంచనాలు నిజమైతే జార్ఖండ్‌లో తొలిసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతోంది. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీలో స్థానాలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 41 సభ్యుల మద్దతు తప్పనిసరి. పోల్ డైరీ అంచనా ప్రకారం కాంగ్రెస్ కూటమి 28 నుంచి సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. అధికార బీజేపీ 22 నుంచి 30 సీట్లకే పరిమితమవుతోందని వెల్లడించింది. జేవీఎంపీ ఏడు నుంచి తొమ్మిది చోట్ల, ఏజేఎస్‌యూ ఒకటి నుంచి 4 చోట్ల ఇతరులు రెండు నుంచి 5 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది.

సోషల్ ఇనిషియేటివ్ ఫర్ ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా పోల్ డైరీ మాదిరిగా ఉంది. కాంగ్రెస్ కూటమి 28 నుంచి 40 సీట్లు గెలుచుకుంటారని పేర్కొన్నది. బీజేపీ కూటమి 27 సీట్లు గెలుచుకొని ప్రతిపక్షానికి పరిమితమవుతోందని తెలిపింది. జేవీఎంపీ మాత్రం 2, ఏజేఎస్‌యూ 4, ఇతరులు 8 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది. పోల్ డైరీ, సోషల్ ఇనిషియేటివ్ ఫర్ ఇండియా, ఐఏఎన్ఎస్ సీ ఓటర్-ఏబీపీ సంస్థల సర్వేలో కాంగ్రెస్ కూటమి కనీసం 39 సీట్లు గెలుచుకుంటుందని అంచనావేశారు. అంటే అధికారానికి కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. బీజేపీ మాత్రం 28 స్థానాలతో రెండో స్థానంలో నిలువనుంది. ఫలితాలు అటు ఇటుగా మారిన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటే ఖాయమనే వాదన వినిపిస్తోంది.

Related posts