telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమెరికాలో భారత సంతతి బాలికపై వెల్లువెత్తిన మానవత్వం

Girl

అమెరికాలో జాత్యహంకార దాడికి గురైన భారత సంతతి బాలిక ధ్రుతి నారాయణ్‌ (13)ను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకొచ్చారు. ఆమె చికిత్సకు ఇప్పటి వరకూ రూ.4.17 కోట్లు సేకరించారు. ‘గోఫండ్‌ మి’ పేజీ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ విరాళాలు సేకరించారని అమెరికన్‌ బజార్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ తెలిపింది. గత నెల 23న కాలిఫోర్నియాలోని సన్నీవేల్‌లో ధ్రుతి, ఆమె కుటుంబ సభ్యులు రోడ్డు దాటుతుండగా.. పీపుల్స్‌ అనే వ్యక్తి వారిని ముస్లింలు అనుకొని తన మోటార్‌బైకుతో వేగంగా ఢీకొట్టాడు. ఈ దాడిలో ధ్రుతి తీవ్రంగా గాయపడగా.. మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు.

ధ్రుతి నాన్న రాజేశ్‌ నారాయణ్‌, ఆమె సోదరుడూ (9) గాయపడిన వారిలో ఉన్నారు. ధ్రుతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. ఆమె చికిత్స సహాయార్థం ఇప్పటివరకూ 12,360 మంది విరాళాలు ఇచ్చారు. ఈనెల 3న పీపుల్స్‌పై సాంటా క్లారా కౌంటీ కోర్టులో అభియోగాలు మోపారు. అతనిపై ఎనిమిది హత్యాయత్నాల ఆరోపణలు నమోదయ్యాయి. తదుపరి విచారణ ఈనెల 16న జరగనుంది.

Related posts