telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

దోమలను చంపడానికి … మానవ బాంబా.. హాహాహా ..

human gas to kill mosquitoes naturally

దోమకాటు కు భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒక్క కాటు వేస్తె మలేరియా, డెంగ్యూలాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. దోమల మహమ్మారి నుంచి తప్పించుకోవడం కోసం చాలామంది మస్కిటో కాయిల్ లను ముట్టిస్తారు. కొంతమంది దోమ తెరలను, మస్కిటో బ్యాట్ లను వాడతారు. కానీ ఉగాండా లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం తన అపానవాయువు/పిత్తులతో దోమలను దరిచేరకుండా చేస్తున్నాడు. వింతగా ఉంది కదూ… ఇంకో విశేషమేంటంటే… అతడు ఒక్కసారి పిత్తు వేస్తే… 10 కిలోమీటర్ల మేర దోమలు చచ్చిపోతాయి. ఉగాండా లోని కంపాలాకు చెందిన జోయి ర్వమిరామ(48) అనే వ్యక్తి.. నివాసం ఉంటున్న గ్రామంలో ఏ ఒక్క దోమ కూడా బ్రతికి లేదు. ఎందుకని గ్రామస్తులను అడిగితే ర్వమిరామ పిత్తుల దయవల్ల తమకి దోమల బారి నుంచి ఉపశమనం కలిగిందని చెప్తారు. వారి నాలుగు దశాబ్దాల ఊరి చరిత్రలో ఏ ఒక్కరికి కూడా మలేరియా జబ్బు రాలేదంటే అతిశయోక్తి కాదు.

ఈ విషయం తెలుసుకున్న దోమల నివారణ రసాయనిక కాయిల్స్ తయారుచేసే బడా కంపెనీలు.. ర్వమిరామ ఇంటికి వచ్చి.. అతనికి ఉద్యోగం ఇచ్చి మరీ.. అతని పిత్తుల పై పరిశోధనలు చేస్తున్నారని చెప్తున్నాడు. ర్వమిరామ పిత్తులు అంత ప్రాణాంతకంగా ఎలా ఉన్నాయోనని తెలుసుకోవడానికి.. అతని పిత్తులకున్న లక్షణాలని కనిపెడుతున్నారని జోయి చెప్పాడు. ఒక స్థానిక బార్బర్ మాట్లాడుతూ..జోయి పిత్తులు వేసి దోమలను చంపుతాడని నగరం మొత్తం తెలుసు. జోయి ఉన్న ప్రదేశాల్లో దోమలు పారిపోతాయి. ప్రజలను గౌరవించి వారి పక్కన ఉన్నప్పుడు అతను పిత్తు వేయడు.. కేవలం దోమలు ఉన్నప్పుడు మాత్రమే అతను తన పిత్తులను వాడతాడని చెప్పాడు. ఇప్పటికే ర్వమిరామ గురించి తెలిసిన చాలామంది వ్యక్తులు… అతన్ని వారి పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్లి పిత్తులు వదిలించి దోమలను చంపేస్తున్నారు.

దీనిపై జోయి మాట్లాడుతూ..నేను అందరిలాగే సాధారణ ఆహారమే తీసుకుంటాను. కానీ నా చెంతకు ఒక్క చిన్న పురుగు కూడా రాదు. ప్రతి రోజూ స్నానం చేస్తాను. నా దగ్గర ఏమి దుర్వాసన కూడా రాదు. నా పిత్తులు కేవలం చిన్న దోమల, పురుగులకే ప్రాణాంతకం. నా కల ఏంటంటే.. దోమల నివారణ మందులపై నా మొహం ముద్రించాలి, అని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని నిపుణులు నిర్దారించవల్సి ఉంది.

Related posts