telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్ము కశ్మీర్‌ : … లోయలో లెక్కకు మించి .. తీవ్రవాదులు..

huge terrorist camps found in kashmir valley

భారత్ సరిహద్దు ప్రారంతో పాకిస్థాన్ పెద్ద ఎత్తున ఉగ్రశిబిరాలను కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సరిహద్దు వెంబడి చొరబాట్లు సైతం భారీగా వెల్లడించాయి. దాదాపు 18 ఉగ్రశిబిరాలు, 20 లాంఛ్ ప్యాడ్లు ప్రారంభమైనట్టు అధికారులు గుర్తించారు. దీని ప్రకారం ఒక్కో ఉగ్రవాద శిబిరంలో సాయుధులైన ఉగ్రవాదులు దాదాపు 60 మంది వరకు ఉండవచ్చంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పలుచోట్ల భారీ ఎత్తున విధ్వంసం సృష్టించే పథక రచనలో భాగంగా పుల్వామాలో ఇటీవల హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహ్మద్‌కు చెందిన నేతలు సమావేశమయ్యారని నిఘావర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర పోలీస్ బాస్ దిల్‌బాగ్‌ సింగ్ ప్రకటించిన రెండో రోజే .. లోయలో ఉన్న ఉగ్రవాద శిబిరాల గురించి బయటకు తెలియడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే సరిహద్దు ప్రాంతంలో ఎటువంటి అలజడి రేగినా వెంటనే తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు. అదే విధంగా కేంద్రం అనుమతిస్తే బాలాకోట్ తరహా దాడలు చేసేందుకు తాము కూడా రెడీ అంటూ కొత్త ఐఏఎఫ్ చీప్ భదౌరియా కూడా ఇప్పటికే ప్రకటించారు.

Related posts