telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

లెక్కింపు నాడు తప్పని గొడవలు .. అదనపు బలగాల మోహరింపు…

AP Assembly contest candidates

ఈ నెల 23 లెక్కింపు కావున అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అని. మరో వైపు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే రోజు కోసం ఎదురుచూస్తున్నాయి. అయిదేళ్ళ క్రితం త్రుటిలో అధికారంలొ పోగొట్టుకున్న వైసీపీ ఇపుడు ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోంది. ఆ పార్టీ పోలింగ్ బాగా చేయించుకుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ధీమాగా ఉంది. మరో వైపు టీడీపీ ఈసారి అధికారం రావడం చారిత్రక అవసరం అంటోంది. తాము గెలుస్తామని బయటకు చెబుతున్నా లోపల మాత్రం బెంగ బెరుకు అలాగే ఉన్నాయి. ఎన్నికల వేళ టీడీపీ అల్లర్లకి దిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఆ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు ఇస్తున్న ట్రైనింగులో ప్రత్యర్ధులకు మెజారిటీ వచ్చిన చోట రీ కౌంటింగునకు డిమాండ్ చేయామని చెబుతున్నారట.

అవకాశం దొరికింది అని అనుకున్న ప్రతి విషయాన్నీ ఉపయోగించుకుని ఎలాగైనా కౌంటింగ్ ఆలస్యం చేసేలా చూడాలనుకుంటున్నారుట. నిజానికి పోలింగ్ వేళ ఎన్నడూ లేని విధంగా గొడవలు జరిగాయి. ఆరేడుగురు దారుణంగా చనిపోయారు. ఇపుడు కౌంటింగ్ వేళ కూడా అలాగే చాలా చోట్ల జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఇతర సీనియర్ నేతలు డిల్లీ వెళ్ళి ఈసీని కలసి ఏపీలో అదనపు బలగాలు కావాలని కోరారు. సున్నితమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయని, గొడవలకు అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు.

election-commissionఅదనపు బలగాలు అవసరం అని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్రాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. గతంలో గొడవలు జరిగిన సీమ జిల్లాలు, కోస్తా ప్రాంతాల్లో అదనపు బలగాలు కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. కనీసంగా పది బెటాలియన్ల కేంద్ర బలగాలు కావాలని కోరారు. మరి ఇవన్నీ చూస్తూంటే ఈసారి అల్లర్లు విపరీతంగా జరిగే అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతోంది. అసలే వీవీ ప్యాట్స్ తో ఫలితాలు ఆలస్యం అవుతాయి. ఇక టీడీపీ ఇచ్చిన ట్రైనింగు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ వారు గొడవలకు దిగుతారని టీడీపీ చెబుతోంది. మరి ఇలా మోహరిస్తే కౌంటింగ్ కేంద్రాలు యుధ్ధ వాతావరణాన్ని తలపిస్తాయేమోనని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Related posts