telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా … ముస్లింలు భారీ ర్యాలీ ..

huge rally in hyderabad on CAA

తెలంగాణాలో కూడా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది ముస్లింలు తరలొచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు నగరంలోని ముస్లిం యువత కదిలొచ్చి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ట్యాంక్‌బండ్‌పైకి ఆశేష జనవాహిని చేరుకోవడంతో ‘మిలియన్ మార్చ్’ను తలపించింది. ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, లిబర్టీ జనసంద్రాన్ని తలపించాయి. ముస్లింలు జాతీయ జెండా చేతబట్టుకొని హిందుస్థాన్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో దాదాపు 25 వేల మందికిపైగా ముస్లింలు పాల్గొన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముస్లింల ర్యాలీతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ట్యాంక్‌బండ్‌పై వచ్చే రహదారులు గంటల తరబడి వాహనాలు ఆగిపోయాయి.

ధర్నాచౌక్ వద్ద సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనితో భారీ స్థాయిలో ముస్లిం యువత రావడం.. ట్యాంక్‌బండ్‌పైకి దూసుకొచ్చారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లిబర్టీ నుంచి భారీగా ముస్లింలు తరలివచ్చారు. వీరంతా ప్రణాళిక ప్రకారం ట్యాంక్‌బండ్‌పైకి వచ్చినట్టు తెలుస్తోంది. గాంధీ-నెహ్రూ కల్పించిన స్వాతంత్ర్య, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కావాలని ముస్లిం యువత నినాదించింది. ప్రజా వ్యతిరేక చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని తేల్చిచెప్పారు. నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, ఎంబీటీ నేత అంజద్ ఉల్లాఖాన్, మౌలానా నజీరుద్దీన్, సీపీఐ నేత అజీజ్ పాషా, రిటైర్డ్ జడ్జీ జస్టిస్ చంద్రకుమార్, అఖిల భారత ముస్లిం యాక్షన్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts