telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేరళ : … భారీ వర్షాలకు .. అలర్ట్…

huge rains in kerala

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో విపత్తు ప్రతిస్పందన విభాగ అధికారులు ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్‌ జిల్లాల్లో గురువారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించారు. రానున్న మూడు రోజుల్లో ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బృందాలు రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలు ప్రారంభించాయి.

ఈ భారీ వర్షాల కారణంగా మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. అదేవిధంగా ఇడుక్కి, కోలికోడ్‌ జిల్లాలకు శనివారానికి ‘ఆరెంజ్‌ అలర్ట్'(భారీ నుంచి అతి భారీ వర్షాల) హెచ్చరికలను సైతం జారీ చేశారు. గతేడాది కేరళలో వరదలు సంభవించి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా వర్షాలు అదే స్థాయిలో కురుస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత వాతావరణ కేంద్రం పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌, మధ్య మహారాష్ట్ర, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.

Related posts