telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈసారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీ కష్టమే…

యూఎస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతున్నది.  జో బిడెన్ 238 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా, ట్రంప్ 213 ఓట్లు సాధించారు.  స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ ముందంజలో ఉన్నారు.  అయితే, ఇంకా లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నాయి.  ముందస్తు ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు లెక్కించాల్సి ఉన్నది. ఈ ఓట్ల లెక్కలు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది.  అయితే, గతంలో గెలిచిన అభ్యర్ధికి మెజారిటీ ఎక్కువగా ఉండేది.  కానీ, ఈసారి ఆ అవకాశం ఉండకపోవచ్చు.  జో, ట్రంప్ ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉన్నది.  10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న విస్కాన్సిన్ ఫలితం ఇరు అభ్యర్థులను ఒత్తిడికి గురి చేస్తున్నది.  ఈ 10 ఓట్లు ఇద్దరికీ కీలకమే.  2016 ఎన్నికల్లో ట్రంప్ కు 306 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా, హిల్లరీ క్లింటన్ 227 ఓట్లు సాధించారు.  కానీ, ఈసారి ఆ స్థాయిలో ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారు.  అదే విధంగా పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.  అక్కడ ఇంకా 10 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉన్నది.  అయితే, అక్కడ ఆలస్యంగా వచ్చిన ఓట్లను కూడా అనుమతించారని, దీనిపై వెళ్తానని ట్రంప్ అంటున్నాడు.  ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి తాను గెలిచినట్టు నిర్ధారించారు. ఇప్పుడు ఇదే వివాదాలకు కారణమైంది.  

Related posts