telugu navyamedia
sports

బ్రెజిల్ లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం..

బ్రెజిల్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పసికందులు సజీవదహనం కావడం సంచలనం రేపింది. బ్రెజిల్ లోని ఒక ఫుట్ బాల్ క్లబ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. వీరందరూ పది నుంచి 16 ఏళ్ల లోపు వారే. రియో డి జెనీరోలోనే అత్యంత పెద్దదైన ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌లో ఈ దారుణం జరిగింది. క్లబ్‌లోని డార్మిటరీలో క్రీడాకారులు నిద్రిస్తున్న వేళ మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన మంటల్లో చిక్కుకున్న చిన్నారులు తప్పించుకునే మార్గం లేక మంటలకు ఆహుతయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌కీ, మరో జట్టుకి మధ్య నేడు మ్యాచ్ జరగాల్సి ఉండగా అంతలోనే ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. విషయం తెలిసిన గవర్నర్ విల్సన్ మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.

Related posts

బంగ్లాదేశ్ జట్టుకు కోచ్ గా … రసెల్ డొమింగో …

vimala p

గూగుల్ లో .. వరల్డ్ కప్ సందడి.. డూడుల్..

vimala p

షూటింగ్ వరల్డ్‌కప్‌ : భారత్‌కు రెండు స్వర్ణాలు..

vimala p