telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

రేపే .. చంద్రయాన్ 2.. భారీగా వీక్షకుల కోసం ఏర్పాట్లు..

isro released chandrayan photos

ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకుల కోసం భారీ గ్యాలరీని అధికారులు సిద్ధం చేశారు. ప్రయోగ వేదికకు సమీపంలోని శబరి గిరిజన కాలనీ ప్రాంతంలో సుమారు 60 ఎకరాల అటవీ భూమిలో ఈ గ్యాలరీని నిర్మించారు. దీంట్లో సుమారు 5 వేల మంది సందర్శకులు కూర్చుని రాకెట్ ప్రయోగాన్ని వీక్షించవచ్చు.

ఈ నెల 15న చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడడంతో రాకెట్ లాంచింగ్‌ను చూడాలనుకున్న వీక్షకులకు నిరాశే మిగిలింది. గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వాళ్లకు ఇచ్చిన సీరియల్ నంబర్లతో పాసులు తీసుకొని ఈ నెల 22న ప్రయోగాన్ని సందర్శకులు వీక్షించవచ్చని ఇస్రో పేర్కొంది.

Related posts