• Home
  • వార్తలు
  • పద్మ పురస్కారాలకు 50వేల దరఖాస్తులు… ఎంపిక ప్రక్రియలో మార్పులు
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

పద్మ పురస్కారాలకు 50వేల దరఖాస్తులు… ఎంపిక ప్రక్రియలో మార్పులు

huge applications received for padma awards

ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ కు ఈ సారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది పద్మ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 49,992 వరకు ఉన్నారు. 2010తో పోలిస్తే ఈ సంఖ్య 32 రేట్లు ఎక్కువ అని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ పురస్కారాల కోసం 2016లో 18,768; 2017లో 35,595 మంది దరకాస్తు చేసుకున్నారు.

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పురస్కారాల ఎంపిక ప్రక్రియలో అనేక మార్పులు చేసింది. మట్టిలోని మాణిక్యాలను ఎవరైనా, ఎవరినైనా ప్రతిపాదించే విధంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి, తద్వారా దరఖాస్తులు స్వీకరించే ఏర్పాటు చేసింది. దీనిద్వారా ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల వారు కూడా ఈ పురస్కారాలకు దరకాస్తు చేసుకోవచ్చు. దేశానికి నిస్వార్థంగా సేవలు చేసిన వారు ఎంతో మంది ఈ నూతన ఎంపిక విధానం వలన వెలుగులోకి వచ్చారు.

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ పురస్కారాల కోసం ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరించింది. అయితే నూతన ఎంపిక విధానం వలన కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారత రత్న, పద్మ గ్రహీతలు, ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్స్ లెన్స్ తదితర వర్గాలు ఎవరినైనా నామినేట్ చేసేలా వీలు కల్పించింది.. అందుకే ఈ సారి దరఖాస్తుల వెల్లువెత్తాయని హోమ్ శాఖవర్గాలు వెల్లడించాయి.

Related posts

సంజయ్ సహనమే విజయానికి సోపానం

admin

కొండా దంపతుల ఒంటెద్దు పోకడలు

madhu

అమెరికాలోని గ్రేట్ మిల్స్ హై స్కూల్ లో కాల్పులు

admin

Leave a Comment