telugu navyamedia
telugu cinema news

ఆకట్టుకుంటున్న “పడిపడి లేచే మనసు” మరో సాంగ్

Padi-Padi-Leche-Manasu

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం “పడిపడి లేచే మనసు”. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, టైటిల్ ట్రాక్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. “నువ్వు నడిచే నేలపైనే… నడిచానా ఇన్నాళ్లుగా…” అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కన్పిస్తుండగా… సాయిపల్లవి డాక్టర్ గా నటిస్తోంది. మరి ఈ నెలలోనే విడుదలయ్యే ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సిందే.

Related posts

వేడుక చూద్దాం…

vimala p

నీ ప్రేముంటే చాలు…

vimala p

మలయాళ హీరోతో జాన్వీ కపూర్…!

vimala p